దటీజ్.. హరీష్‌ రావు..!

ఆరోగ్యం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

దటీజ్.. హరీష్‌ రావు..!
– మురుగు కాల్వలో చెత్త తీసిన మంత్రి
– ఎందుకీ పనిచేశారంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మంత్రి తన్నీరు హరీష్ రావు అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఆరోగ్య శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా తనదైన ముద్రవేస్తూ ముందుకుసాగుతున్నారు. నిత్యం అధికార కార్యక్రమాలు, ప్రజా సమస్యలు.. పర్యటనలు.. నిత్యం బిజీబిజీగా ఉండే ఆయన తన నియోజకవర్గంకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రజల మద్య పర్యటిస్తూ పలు విధాలుగా ప్రజలను చైతన్య పరుస్తారు. తాజాగా సోమవారం నడకతో ఆరోగ్యం.. చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం అనే నినాదంతో సిద్ధిపేట మున్సిపాలిటీ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు పరిసరాల పరిశుభ్రత – పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను తొలగిద్దాం.. ఆరోగ్యంగా ఉందాం.. అనే కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణంలోని 18 వార్డులో పర్యటించారు.

కార్యక్రమాన్ని ప్రారంభించి అలా వెళ్లిపోకుండా ఆ వార్డు మొత్తం తిరిగి, డ్రైనేజీలోని చెత్తను తానే స్వయంగా తీసి వేశారు. మురికి కాల్వల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, వాటర్, చాయ్ గ్లాసులు, శానిటరీ వేస్ట్ చెత్తను స్వయంగా మంత్రి హరీష్ రావు చేతితో ఎత్తి సంచిలో వేశారు. అనంతరం వీధి వీధి తిరుగుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. ఆరోగ్యం బాగుంటుంది అంటూ అందరికీ సూచించారు. ఈ దృశ్యాలను చూసిన స్థానిక ప్రజలు, అధికారులు దటీజ్ హరీష్‌ రావు అంటూ ప్రశంసలు కురిపించారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage