ఉద్యమ కారుడికి చేయూత
– ఆపన్న హస్తం అందించిన ఆర్సీ గౌడ్
– రూ. 4 వేలతో నిత్యవసరుకుల పంపిణీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్పంచుకున్న ఉద్యమ కారుడి గోసను చూడలేక తాండూరు మండల బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు ఆర్.చంద్రశేఖర్ గౌడ్(ఆర్సీ గౌడ్) చలిపోయారు. ఆపదో ఉన్న ఉద్యమ కారుడుకు సొంత ఖర్చులతో నిత్యవసర వస్తువులు అందించి ఆపన్న హస్తం అందించారు. వివరాల్లోకి వేళితే.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేశవులు చురుగ్గా పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉద్యమంలో అందరిని చైతన్య పరిచారు. ప్రస్తుతం అతని పరిస్థితి దయనీయంగా మారింది. పొట్ట కూటికోసం కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కేశవులు తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్‌ను కలవడంతో నిస్సాయస్థితిలో ఉన్న అతనికి చేయూతను అందించేందుకు ముందుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆర్సీ గౌడ్ ఉద్యమ కారుడు కేశవులకు తన సొంత ఖర్చులతో రూ. 4వేలతో నిత్యవసర సరుకులను అందించారు. ఉద్యమంలో చురుగ్గా ఉన్న కేశవులకు ఏమాత్రం కృంగిపోవద్దని, ధైర్యంగా ఉండాలని మనోధైర్యం నింపారు. ఇదిలా ఉండగా ఆర్సీ గౌడ్ ఇప్పటి వరకు ఎంతో మందికి మానవతా దృక్పథంతో సాయం అందించారు. తాజాగా ఉద్యమ కారుడుకు చేయూతనందించడం పట్ల పార్టీ నేతలు ఆర్సీ గౌడ్‌కు అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి…

