ఇలా ఎగబడుతున్నాయ్ ఏంట్రా..!
– మహిళా మీదకు దూకిన కుక్కలు
– చెదరగొట్టి కాపాడిన స్థానికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉరికే నడుచుకుంటూ వెలేదామంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

చిన్నారులు, మహిళలపైకి వీధి కుక్కలు ఎగబడుతున్నాయి. గురువారం తాండూరు పట్టణంలో ఓ మహిళ పైకి కుక్కలు దాడికి యత్నించాయి. పట్టణంలోని 26 వార్డు గుమాస్తా నగర్లో ఈ సంఘటన జరిగింది. రోడ్డు మీద ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుంది. అక్కడే గుంపుగా ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా ఆ మహిళ మీదకు దూసుకెళ్ళాయి.

అప్రమత్తం అయిన స్థానికులు వెంటనే వాటిని తరిమికొట్టారు. దీంతో మహిళ ఊపిరి పీల్చుకుంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఈ సంఘటనపై ప్రజలు అధికారులపై విమర్శలు చేస్తున్నారు. వీధి కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
వీడియో


ఇది కూడా చదవండి…

