దూకుడు పెంచిన బీఆర్ఎస్..!
– ముందే అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు
– గులాబీ బాస్ యాక్షన్ ప్లాన్ రెడీ
– 112 స్థానాలలో అభ్యర్థుల ఖరారు
– ఓ ఎమ్మెల్సీకి, మరోచోట జెడ్పీ చైర్మన్‌కు అవకాశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికలకు 100 రోజుల ముందే యాక్షన్‌లోకి అన్నట్టుగా దూకుడు చూపిస్తూనే.. శ్రావణం సెంటిమెంట్ ఫాలో అయ్యి కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటిస్తారని జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే 119 స్థానాలకు గాను.. 112 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసేశారని తెలుస్తోంది. ఎంఐఎం పోటీ చేసే స్థానాలు మినహా ఇస్తే మిగతా చోట్ల ఫైనల్ అయిపోయినట్టే అని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక విషయంలో KCR కసరత్తు పూర్తైపోయింది. దాదాపుగా సిట్టింగ్‌లకే సీట్లు కన్ఫామ్ చేస్తున్నారు.. ఈ రెండు, మూడు రోజుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులపై ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.
ఉమ్మడి మెదక్‌లో ఒక స్థానంలో, ఆదిలాబాద్‌లో రెండు స్థానాల్లో.. ఉమ్మడి వరంగల్‌లో ఒక చోట, ఉమ్మడి కరీంనగర్‌లో మరో చోట అభ్యర్థల మార్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డిలో కూడా ఒక చోట సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడం లేదట. 95 శాతం వరకు సిట్టింగులకే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారట. ఇప్పటికే ఆయా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల బుజ్జగింపు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తేలడంతో కేవలం 6 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల మార్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ 6 స్థానాల్లో ఒకచోట ఎమ్మెల్సీకి, మరో చోట జెడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే నోటిఫికేషన్‌కి ముందే దాదాపుగా అభ్యర్థుల్ని ప్రకటించినట్టే లెక్క. ఇదిలా ఉండగా కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందనే సంకేతాలు ఉన్నాయి.. మరి వాళ్లకు ఏమైనా ఒకట్రెండు సీట్లు కేటాయించే ఛాన్స్ ఉందా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎంఐఎం అభ్యర్తులు ఉన్న చోట్ల ఏం చేస్తారు అన్నది కూడా తెలియాలి ఉంది.
ఇలాంటి పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ ధైర్యంగా 95 శాతం సీట్లు వారికే ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను కేసీఆర్ పక్కాగా రెడి చేశారని టాక్ వినిపిస్తోంది. మరి అసంతృప్తితో ఉన్న నేతల్ని ఎలా బుజ్జగించారు.. వారికి ఎలాంటి హామీ ఇచ్చారన్నది ఆసక్తికరం.
ఇది కూడా చదవండి…

