కాంగ్రెస్ పార్టీతోనే అన్నివర్గాల అభివృద్ధి
– చేవేళ్ల ఎంపీ అభ్యర్థి సతీమణి సీతాదేవి
– తాండూరులో ఇంటింటి ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యపడుతుందని చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీతాదేవి అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధిలో చేవేళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి తరుపున ఆయన సతీమణీ సీతాదేవి తాండూరు ఎమ్మెల్యే సతీమణి అరుణ, ఆర్యవైశ్య కార్పోరేషన్ రాష్ట్ర చైర్మన్ కల్వ సుజాత, బీసీ సెల్ కన్వీనర్ సునీతాసంపత్ లతో కలిసి ప్రచారం చేశారు.
కాంగ్రెస్ పార్టీ, రంజిత్ రెడ్డి గెలుపుకోసం ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. చేవేళ్ల ప్రాంత అభివృద్ధికి రంజిత్ రెడ్డి కృషి చేస్తారని అన్నారు. ఎన్నికల్లో రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ ‘ పర్సన్ స్వప్న పరిమళ్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, నాయకులు మాదవి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

