రోడ్డుకోసం పొట్టగొట్టోద్దు..!
– ఎన్‌హెచ్ భూనిర్వాసితుల ఆగ్రహం
– భూములు ఇవ్వలేమన్న రైతులు
– రసాభసాగా అభిప్రాయ సేకరణ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: జాతీయ రోడ్డు కోసం సర్కారు తమ భూములను లాక్కోని పొట్టగొట్టద్దని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హైవేకు మా భూములు ఇవ్వలేమని అన్నారు. మహబూబ్ నగర్ నుంచి తాండూరు మీదుగా చించొల్లి వైపు వెళుతున్న జాతీయ రహదారి 167లో భూములు కోల్పోతున్న రైతులతో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. గురువారం తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్ రావు అధ్యక్షతన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు జాతీయ రోడ్డుకు తమ భూములను ఇచ్చేది లేదన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ పొలాల్లో హద్దులను నిర్ణయించడం పట్ల హైవే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే రైతులపై పొట్టగొట్టే విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. హైవే రోడ్డు కోసం రైతుల నుంచి బలవంతంగా లాక్కోవద్దని ఆవే దన వ్యక్తం చేశారు. ఇదే భూములను ప్రభుత్వం ఎకరాకు కోట్లకు విక్రయిస్తుందని, రైతుల నుంచి ప్రభుత్వం తీసుకుంటే లక్షలకే కొనుగోలు చేస్తుందని మండిపడ్డారు.. ఇదె ం న్యాయం అని అధికారులను ప్రశ్నించారు. భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభిప్రాయ సేకరణ కాస్త రసాభసాగా మారింది.
అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ జాతీయ రహదారి కోసం 258 మంది రైతుల నుంచి 67 హెక్టార్ల భూమిని సేకరించడం జరిగిందన్నారు. తాండూరు మండలంలో రైతులకు సంబంధించిన అభిప్రాయ నివేధికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామన్నారు. రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని. మరోసారి రైతులతో సమావేశం నిర్వహ వాస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, హైవే అధికారులు రమేష్ రెడ్డి, ఆర్ఎస్ఐ రాజీరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

