కేటీఆర్‌ను క‌ట్టేసిన కాన్ఫిడెన్స్

కెరీర్ తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

కేటీఆర్‌ను క‌ట్టేసిన కాన్ఫిడెన్స్
– పేప‌ర్ బాయ్‌ను అభినందించిన మంత్రి
– మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని కితాబు
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో తెలియంది కాదు. ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకుని ఆయన ప్రజాసేవ సాగిస్తుంటార‌ని చెప్పాల్సిన ప‌నేలేదు. సోషల్ మీడియా ద్వారా ఎవరైనా తన సాయం కోరితే కాదనకుండా అండగా ఉంటూ వస్తున్నారు. తాజాగా జగిత్యాలకు చెందిన ఓ బాలుడి వీడియో మంత్రి కేటీఆర్ కంట పడింది. ఆ వీడియోలో బాలుడు చెప్పిన మాటలు విని మంత్రి ముగ్దుడ‌య్యారు. మంచి ఫ్యూచర్ ఉందంటూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కేటీఆర్‌ను అంత‌గా క‌ట్టిప‌డేసిన బాలుడు కాన్ఫిడెన్స్ వీడీయో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. జగిత్యాలకు జిల్లాకు చెందిన 9వ తరగతి విద్యార్థి ప్రకాష్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. జగిత్యాలకు చెందిన ఈ వీడియో బాగా నచ్చింది అని కామెంట్ చేశారు. బాలుడు చెప్పిన ప‌లుకుల‌కు ఫిదా అయ్యారు. ఆ వీడియోలో ఉన్న బాలుడిపై ప్రశంసలు కురిపించారు. ‘‘జగిత్యాలలోని ప్రభుత్వం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న
ఈ బాలుడి పేరు జై ప్రకాశ్. పేపర్ వేస్తూ చదువుకుంటున్నాడు. అతని ఆత్మవిశ్వాసం, ప్రశాంత చిత్తం, ఆలోచనా విధానం, వ్యక్తీకరణ, స్పష్టత నాకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చారు. ‘చదువుతూ పని చేయడంలో తప్పేముంది. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్‌లో మంచి స్థితిలో ఉంటాను’ అని బాలుడు చెప్పిన విధానం. అతని ఆత్మవిశ్వాసం నన్ను బాగా ఆకట్టుకుంది.’’ అంటూ మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంతో స్పూర్తిదాయ‌కంగా మాట్లాడిన పేప‌ర్ బాయ్‌ను అభినందించిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మంచి రెస్పాండ్స్ వస్తుంది. జై ప్రకాష్‌కు చేయూత ఇవ్వాల్సిందిగా పలువురు సూచిస్తున్నారు.