– హుజూరాబాద్ సభలో సీఎం కేసీఆర్
ప్రభుత్వ ఉద్యోగులకు దళిత బంధు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ సభలో పాల్గొన్న కేసీఆర్ దళిత బంధు పథకంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం సర్కారు
కృషి చేస్తందని అన్నారు. దళిత బంధు పథకంను హుజూరాబాద్ నుంచే ప్రారంభం అవుతుందన్నారు. మొదట పేద దళిత కుటుంబాలకు అమలు చేస్తామని అన్నారు. తరువాత రైతు బంధు తరహాలో దళితులందరికి అమలు చేస్తామన్నారు. చివరి దశలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
