పనోడీ పనిస్మెంట్..!
– కోపంతో యజమానికి కరెంట్ షాక్
– వైరల్ అయిన సంఘటన
దర్శిని డెస్క్: మనకు తీరక లేకనో.. ఓపిక లేకనో.. స్థోమతను బట్టి చాలా మంది ఇంట్లో పనోళ్లను పెట్టుకోవడం సాధారణమే. ఇంట్లో పెట్టుకున్న పనోళ్లు మంచోళ్లు ఉంటారు. చెడ్డోళ్లు ఉంటారు. అందులో రెండో రకానికి చెందిన ఓ పనోడు యజమానిపై చిర్రెత్తి హేవీ షాక్ ట్రీట్ మెంట్‌తో పనిస్మెంట్ ఇచ్చాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే. మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని అంధేరిలో బేత్‌షీబా సేథ్ అనే మహిళ ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే తన ఇంట్లో వంట చేయడానికి ఆమె రాజు సింగ్ అనే ఒక వ్యక్తిని నియమించుకుంది. అయితే అతడు పని సరిగా చేయటం లేదని ఆమె ఓ సారి అతడిపై దురుసుగా ప్రవర్తించింది. దీంతో రాజు సింగ్ ఆమె అతనిపై అలా ప్రవర్తించడం తట్టుకోలేక కోపం పెంచుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం రాజ్ సింగ్ ఆమె నివసించే ఫ్లాట్‌కు వెళ్లి.. అదనపు తాళం చెవితో ఇంటి తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్లాడు. అక్కడే నిద్రిస్తున్న బేత్‌షీబా సేథ్‌కు రాజు సింగ్ విద్యుత్ బోర్డులోని సాకెట్‌లో వైర్లు ఉంచి కరెంటు షాక్ ఇచ్చాడు. దీంతో ఆమె ఉలిక్కిపడి లేచింది. ఏమైందోనని చుట్టుపక్కల చూసింది. అయితే ఆమె నిద్ర లేవగానే ఇప్పుడు ఎలా ఉందంటూ ఆ నిందితుడు ఆమెను ప్రశ్నించాడు. అంతేకాదు ఆమెపై అలా వరుసగా కొన్నిసార్లు షాక్ ఇచ్చాడు. దీంతో సేథ్ ఆ కరెంట్ షాక్ చిత్రహింసలను భరించలేకపోయింది.
ఇక రాజు సింగ్‌తో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య గొడవ జరగుతుండగా.. రాజు సింగ్ ఆమె గొంతు నులిమేందుకు ప్రయత్నించాడు. గట్టిగా కేకలు వేయడంతో ఆ అరుపులు విని పక్క గదిలో నిద్రపోతున్న ఆమె కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. బేత్‌షీబా వెంటనే తన కొడుక్కి పారిపొమ్మని చెప్పింది. అయితే కొద్ది సేపటి తర్వాత ఆ నిందితుడు బాధితురాలికి క్షమాపణలు చెప్పాడు. నేను ఇలా చేసి ఉండాల్సింది కాదని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ దాడి గురించి సేథ్ తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో వెంటనే వారు ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చేశారు. ఇక చివరికి ఈ ఘటనపై అంబోలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి…

