మైనార్టీలకు పంద్రాగస్టు గిఫ్ట్‌..!

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మైనార్టీలకు పంద్రాగస్టు గిఫ్ట్‌..!
– 16వ తేది నుంచి లక్ష సాయం
– చెక్కుల పంపిణీకి సర్కారు నిర్ణయం
– ఆదేశించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని మైనార్టీలకు సర్కారు పంద్రాగస్టు గిప్టును అందించేందుకు సిద్దమైంది. బీసీల మాదిరిగా మైనార్టీలకు అందించే రూ. 1లక్ష సాయం మొదటి విడత లబ్ధిదారులకు ఈనెల 16 నుంచి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మైనార్టీల సంక్షేమంలో భాగంగా రూ.లక్ష ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10వేల మంది లబ్ధిదారులకు ఈనెల 16 నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించాలని తెలిపారు. మొత్తం రూ.400 కోట్లు ఈ కార్యక్రమం అమలుకు కేటాయించాలని ఆర్థికశాఖను మంత్రి ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగాలని చెప్పారు. మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై మరింతగా దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు.

శాసనసభలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో మంత్రులు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఇతర వర్గాలతో సమానంగా మైనార్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఉపసభాపతి పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!