స్వచ్ఛ తాండూరు లక్ష్యం
– నిరంతరంగా పారిశుద్ధ్య పనులు
– ఇండియన్ స్వచ్ఛత లీగ్ పై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరును స్వచ్ఛతంగా తయారు చేయడమే లక్ష్యమని స్థానిక మున్సిపల్ అధికారులు అన్నారు. ఇండియన్ స్వచ్ఛత లీగ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చెత్త సేకరణపై సూచనలు అందించారు. చెత్తను తొలగించిన ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించే కార్యక్రమాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ స్వచ్ఛత లీగ్ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వచ్చేనెల 2వ తేది వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. తాండూరును స్వచ్ఛత తాండూరుగా మార్చడమే లక్ష్యమన్నారు. ఇందుకు ప్రజలు అందరు సహకరిచాలన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణకు తోడ్పాటు అందించాలన్నారు. ఈ పారిశుద్ధ్య పనులు నిరంతరం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇను స్పెక్టర్లు కృష్ణయ్య, వెంకటయ్య, ఎన్వీరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, జవాన్లు శ్రీనివాస్, వెంకటేష్, శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

