విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
– కౌన్సిలర్ సంగీతా అజయ్ సింగ్ ఠాకూర్
– బదిలీపై వచ్చిన హెచ్ఎం, టీచర్లకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులకు గుణాత్మక విద్యనందించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీతా అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా వార్డులోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలకు హెచ్ఎం నాగదేవి, టీచర్లు సరిత, జగదీశ్వరీలు బదిలీపై వచ్చారు.

ఈ సందర్బంగా శనివారం కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ పాఠశాలలో హెచ్ఎం, టీచర్లకు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హెచ్ఎం సరిత, టీచర్లు బదిలీపై రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని కోరారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు ఆటల్లో రాణించేలా చూడాలన్నారు. క్రమశిక్షణను నేర్పించాలని, తల్లిదండ్రులను, గురువులను గౌరవించేలా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్ మాధవి, చైర్మన్ లలిత తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి….

స్పూర్తి దాయకులు డా.బాబు జగ్జీవన్‌ రామ్