రేపే టెట్ రిజల్ట్..!

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

రేపే టెట్ రిజల్ట్..!
– ప్రకటించిన అధికారులు
– ఎలా చూసుకోవాలంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రేపు తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) రిజల్ట్ రీలీజ్ చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రకటించారు. టెట్‌కు హాజరైన అభ్యర్ధులు సెప్టెంబర్‌ 27వ తేదీన తుది ‘కీ’ తో పాటు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చన్నారు. టెట్‌ పరీక్ష పేపర్‌–1కు దాదాపు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక పేపర్‌ 2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే.. వారిలో 1,89,963 మంది అంటే 91.11 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. టెట్‌ ఫలితాల ప్రకటన అనంతరం అందులో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసే వీలుంటుంది. ఈ కారణంగానే టెట్‌ ఫలితాలను త్వరితగతిన ప్రకటించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.