కొత్తగా నమోదైన కేసులు ఇవే..
– కోలుకుంటున్న తెలంగాణ
దర్శిని ప్రతినిధి: తాజా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 412కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 6,54,394కు చేరుకుంది. వీరిలో ఇవాళ్టివరకు 6,43,812 మంది కోలుకున్నారు. మరో 6,728 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా కరోనా వైరస్ బారినపడిన వారిలో 494 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, గడిచిన 24గంటల వ్యవధిలో మరో ఇద్దరు మహమ్మారితో ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాలు 3,854కు పెరిగాయి. ఇవాళ మరో 73,899 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.