సీజ్ సాండ్‌కు ఫుల్ రెస్పాన్స్‌..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

సీజ్ సాండ్‌కు ఫుల్ రెస్పాన్స్‌..!
– బహిరంగ వేలంలో భారీ ధరకు అమ్మకం
– ప్రభుత్వానికి రూ. 2.45లక్షల ఆధాయం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అక్రమ ఇసుక రవాణాలో సీజ్‌ చేసిన ఇసుక వేలానికి పుల్‌ రెస్పాన్‌ వచ్చింది. తాండూరు మండలం చెన్‌గెష్‌పూర్ గ్రామంలోని సర్వేనెంబర్‌లో 83లో 101 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేయగా శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు. తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆదేశాలతో స్థానిక తహసీల్దార్ తారాసింగ్, ఆర్‌ఐ బాలరాజ్ ల ఆధ్వర్యంలో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో సీజ్ చేసిన ఇసుకను సొంతం చేసుకునేందుకు పోటా పోటీ నెలకొంది.

అధికారులు ట్రాక్టర్ ఇసుకకు ప్రభుత్వం ధర రూ.1200లు నిర్ణయించారు. వేలం పాటలో అబ్దుల్ రజాక్, పూజారి పాండు, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సాబేర్ హుస్సేన్, వెంకటేష్, మునీద్ హైమద్, ఎండీ సమీర్ అనే వ్యక్తులు పాల్గొన్నారు. వేలంలో అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి రూ.600లకు ఒక ట్రాక్టర్ పాడగా.. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి 101 ట్రాక్టర్లకు గాను రూ. 2లక్షల 44వేల 925లు అత్యధికంగా పాడి దక్కించుకున్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.2.44 లక్షల ఆధాయం దక్కింది.

వేలంలో ఇసుకను దక్కించుకున్న గోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ పేరుతో డీడీ చెల్లించి ఆదివారం సాయంత్రంలోగా ఇసుకను తరలించుకోవాలని సూచించారు. మరోవైపు ఇసుక వేలం ప్రారంభానికి ముందు కొందరు వేలం పాటను అడ్డుకునేందుకు యత్నించారు. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి అక్కడికి రావడంతో ఆయన సమక్షంలో వేలం పాట ప్రశాంతంగా జరిగింది.

ఇదికూడా చదవండి…

హస్తం నుంచి ఇద్దరు ఔట్…!