ఆశ వర్కర్లను అంగన్ వాడీలను ఆదుకోవాలి
– సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్, టీజేఎస్ నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఆశ వర్కర్లను, అంగన్ వాడీలను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్, టీజేఎస్ నేతలు అన్నారు. శుక్రవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల నిరసన, అంగన్ వాడి కార్యకర్తలు సమ్మె కొనసాగింది.
ఆశ వర్కర్ల నిరసకు కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, టీజేఎస్ ఇంచార్జ్, ఫ్లోర్ లీడర్ సోమశేఖర్లు మద్దతు తెలిపారు. అదేవిధంగా అంగన్ వాడీల సమ్మెకు కూడా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లు, అంగన్ వాడీల డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమన్నారు.
వారి కనీస డిమాండ్లను పరిష్కరించడం సర్కారు బాధ్యత అన్నారు. వారిపై వివక్ష చూపకుండా వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఆశ వర్కర్లు, అంగన్ వాడీలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, ఆశ, అంగన్ వాడీ యూనియన్ నాయకులు, సభ్యులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…


