రోగులకు శుభవార్త..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

రోగులకు శుభవార్త..!
– తాండూరులో ఉచిత ఓపి సేవలు
– సమాజ్ సేవా, ఐఎంఐ ద్వారా నిర్వహణ
– ఏయే రోగాలకు సేవలందిస్తారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : పలు రోగాలతో బాధపడే వారికి ఉచిత ఓపీ సేవలు అందిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా శాఖ జమియతే ఉలేమా హింద్ ప్రతినిధి అబ్దుల్ రెహమాన్ అల్హర్ ఖాస్మి తెలిపారు. జమియతే ఉలేమా హింద్, తాండూరు ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో తాండూరు పట్టణం రాయల్ కాంట సమీపంలో ఉన్న సమాజ సేవ కేంద్రం ద్వారా ఈ సేవలను అందిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

తాండూరులో 15 నుంచి 20 మంది వైద్యులు వివిధ రకాల రోగాలకు సంబంధించి సేవలు అందిస్తున్నారని, వారి నుంచి రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా సమాజ్ సేవ ద్వారా కృషి చేయడం జరుగుతుందన్నారు. జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ఆర్థో, చిన్న పిల్లలు, దంత సమస్యలు తదితర రోగాలకు సంబంధించి ఆయా వైద్యుల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.

పట్టణంలోని డా.జయప్రసాద్(సాయి తరుణ్ ఆసుపత్రి), డా. మల్లికార్జున్ (భావేష్ ఆసుపత్రి), ఎం. సమీవుల్లా(లైఫ్ క్లీనిక్), డా.రమణ (ఎస్వీఆర్ ఆసుపత్రి), డా. అమీర్ (తాండూరు నర్సింగ్ హోం), డా. శరత్ కుమార్ (ఆదిత్య ఆసుపత్రి), డా.హుస్నా అమీర్ (తాండూరు నర్సింగ్ హోం), డా. ఆనంద్ కుమార్(చిన్న పిల్లలు), డా. అనిల్ కుమార్ రెడ్డి(చిన్నపిల్లలు- శివనర్సింగ్ హోం), డా. రమణబాబు (ఆపెక్స్ ఆసుపత్రి), డా.మూర్తి(శివసాయి ఆసుపత్రి), డా.రఫీ (హెచ్ఎన్ డెంటల్ ఆసుపత్రి), డా.శ్రీనివాస్ గౌడ్ (విజయ డెంటల్ ఆసుపత్రి)లకు చెందిన ఆసుపత్రిలలో నిరుపేదలకు ఉచితంగా ఓపీ సేవలను పొందవచ్చన్నారు.

అయితే రోగాల బాధపడే వారు తాండూరు పట్టణంలోని సమాజ సేవా కేంద్రంలో ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9-30 గంటల వరకు టోకన్లను పొందవచ్చన్నారు. పూర్తి వివరాలకు సెల్: 9000878098, 98858 40241 కు సంప్రదించాలని జమియతే ఉలేమా హింద్ జిల్లా ప్రతినిధి అబ్దుల్ రెహమాన్ అర్హర్ ఖాస్మీ సూచించారు. నిరుపేదల కోసం ఉచితంగా అందిస్తున్న ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..

మోగిన ఎలక్షన్ నగారా..!