మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం

తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం
– సర్కారు పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– అట్టహాసంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు నియోజకవర్గం తాండూరు మండలం, యాలాల మండలాల్లో ఇందిరా మహిళ శక్తి కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

యాలాల, తాండూరు మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళలకు నాసిరకం చీరలను అంటగడితే వాటిని రైతులు అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు పొలాలకు కంచెల మాదిరిగా వాడుకునేలా మిగిలిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల చేనేత వారి వద్ద నాణ్యమైన చీరలను తయారు చేసి పంపిణీ చేస్తోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మహిళ శక్తి, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, గృహజ్యోతి వంటి తదితర సంక్షేమా పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మహిళ సంఘాల ద్వారా కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. మహిళలు ముందుకు వస్తే కందిపప్పు, రైస్ మిల్లను ఏర్పాటు చేసుకునేందుకు తోడ్పాటు అందిస్తామని అన్నారు. మరోవైపు యాలాల మండలంలోని లబ్దిదారులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్, మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప, ఎం పీడీఓ విశ్వప్రసాద్, తహసిల్దార్ తారాసింగ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, విజయ భాస్కర్ రెడ్డి, గడ్డం -నర్సిరెడ్డి, ఉప్పరి రాజు, ఏపీఎం బాలయ్య, జిల్లా మహిళ సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మీ, పంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాల నాయకులు, మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసిన స్వప్న పరిమళ్