ఎలక్షన్‌పై స్పెషల్ ఫోకస్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎలక్షన్‌పై స్పెషల్ ఫోకస్..!
– సరిహద్దు ప్రాంతాల్లో ఆరు చెక్ పోస్టులు
– మత్తు, మద్యం, డబ్బు రవాణాపై దృష్టి
– రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ కమీషనర్ డేవిడ్ రవికాంత్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు దృష్టిసారించడం జరిగిందని, తెలంగాణ – కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ కమీషనర్ డేవిడ్ రవికాంత్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ లో జిల్లా ఎక్సైజ్, కర్ణాటక పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ కమీషనర్ డేవిడ్ రవికాంత్ జిల్లా గౌడ్ లతో కలిసి హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా కమీషనర్ ఎక్సైజ్ సూపరిండెంట్ డా. నవీన్ చంద్ర, తాండూరు ఎస్పీ శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ – కర్ణాటక రాష్ట్రాల మద్య ప్రత్యేక దృష్టిసారించడం జరుగుతుందన్నారు. ఇరు రాష్ట్రాల మద్య మత్తు పదార్థాలు, మద్యం, డబ్బు రవాణా జరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. మిర్యాణ్ – కొత్లాపూర్, చత్రసాల – కరణ్ కోట్, బొందెంపల్లి – నీళ్లపల్లి, అడ్కి – మైల్వార్, అల్కోడా – పోతుకంటి, షాదీపూర్ – ఓమ్లానాయక్ తాండా మార్గాల్లో మొత్తం 6 రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో పాటు గతంలో వివిధ కేసుల్లో ఉన్న పాత నిందితులపై నిఘా ఉంచడం జరుగుతుందన్నారు.

కర్ణాటక – తెలంగాణ పోలీసు, ఎక్సైజ్ పోలీసు శాఖల సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం, డబ్బు, మత్తు పదార్థాలు రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక డీసీ సంజయ్, విజయ్ కుమార్, తాండూరు ఎక్సైజ్ సీఐ అనంతయ్య, వికారాబాద్ డీటీఎఫ్ సీఐ దన్వంత్ రెడ్డి, పోలీసు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత