మీ మద్దతుతోనే నెగ్గేస్తా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మీ మద్దతుతోనే నెగ్గేస్తా..!
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– సంఘాలతో ఆత్మీయ సమావేశాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని అన్ని సంఘాల మద్దతుతో ఎన్నికల్లో నెగ్గుతానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య, కుమ్మరి, కమ్మరి తదితర సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ సర్కారు అన్ని వర్గాల సంఘాల అభ్యున్నతికి ప్రాధాన్యమిచ్చిందన్నారు. కుల, చేతి వృత్తి దారులకు ఆర్థిక చేయూతను అందించిందని అన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మరిన్ని సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.

అదేవిధంగా తాండూరులోని అన్ని సంఘాల అభివృద్ధికి తనవంతుగా తోడ్పాటు అందించడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు అందిస్తే నెగ్గితీరుతానని అన్నారు. తనకు అన్ని సంఘాలు అండగా నిలవాలని కోరారు. ఇందుకు ఆయా సమావేశాల్లో సంఘాల సభ్యులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు.

ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త.. శ్రీశైల్ రెడ్డి, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, ఉపాధ్యక్షులు కోటం మురళి, కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, దేవాలయాల చైర్మన్లు కుంచం మురళీధర్, భాను ప్రసాద్, మహిళ సంఘం అధ్యక్షురాలు సరిత, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, కుమ్మరి, కమ్మరి సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!