మా ఆయన్ను మళ్లీ గెలిపించండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మా ఆయన్ను మళ్లీ గెలిపించండి..!
– పైలెట్‌ కోసం సతీమణి ఆర్తి రెడ్డి ఆరాటం
– నేతల ఇండ్లకు వెళ్లి ఎమ్మెల్యే మద్దతుకు కృషి
– ఆర్తి రెడ్డి సమక్షంలో పలువురి చేరిక 

తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యేగా మా అయన్ను మళ్లీ గెలిపించాలని పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణీ ఆర్తి రెడ్డి కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకోసం ఆమె విశేషంగా కృషి చేస్తున్నారు. పార్టీ నేతలను కలవడం, పార్టీని గెలిపించాలని కోరుతూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా బుధవారం తాండూరు పట్టణంలోని పలు వార్డుల్లో ఆమె బీఆర్ఎస్, పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీల నాయకుల నివాసాలకు వెళ్లారు.

బీఆర్ఎస్ పార్టీ తరుపున, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తరుపున ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన పార్టీ మెనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డికి రెండో సారి పట్టం కట్టాలని కోరారు. మరోవైపు పట్టణంలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నరేష్, హేమలత తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విద్యాసాగర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత