పోలీసు అమరుల త్యాగాలు అజరామరం
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
– తాండూరులో ఘనంగా సంస్మరణ దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి: విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీసు అమరుల త్యాగాలు అజరామరం అని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో సీఐ రాజేందర్ రెడ్డి
ఆధ్వర్యంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో పాటు ఎస్ఐలు గిరి, సతీష్, పోలీసు సిబ్బంది పోలీసు అమర వీరుల చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఐ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీస్ అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో ప్రజలకు నాణ్యమైన సేవలందించడం జరుగుతుందని అన్నారు.
