ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 2.48 లక్షలు సీజ్

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 2.48 లక్షలు సీజ్
– వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
– ఎన్నికోడ్‌ను అందరు పాటించాలని సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఎన్నికల కోడ్లో భాగంగా ఇద్దరు వ్యక్తుల నుంచి వేరు వేరుగా రూ. 2లక్షల 48 వేలను పోలీసులు సీజ్ చేశారు. గురువారం ఈ సంఘటన జరిగింది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద తనిఖీలు చేపడుతుండగా ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 1లక్ష 12 వేలు, మరో వ్యక్తి నుంచి 1లక్ష 36 వేలను ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఈ మేరకు వారి వద్ద నుంచి మొత్తం 2లక్షల 48 వేలను సీజ్ చేసి స్క్రీనింగ్ కమిటికి అప్పగించడం జరిగిందని సీఐ రాజేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, వ్యాపారులు ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకుని రూ. 50 వేలకు మించి తరలించరాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుంటే డబ్బలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత