ఆర్టీసీ నుంచి మరో ప్యాకేజీ టూర్..!

టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీ నుంచి మరో ప్యాకేజీ టూర్..!
– తాండూరు నుంచి గాన్గాపూర్‌కు సర్వీస్
– ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్ కుమార్
– డేట్, టైం, చార్జీల వివరాలు ఇలా
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆధాయ మార్గాలను ఉపయోగించుకోవడంలో ఆర్టీసీ ప్రత్యేక దృష్టిసారించింది. పుణ్య క్షేత్రాలకు, దైవ దర్శనాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్యాకేజీ టూర్లను అందుబాటులో ఉంచుతోంది. ఇటీవల శ్రీశైలం టూర్ నిర్వహించిన తాండూరు ఆర్టీసీ డీపో నుంచి మరో ప్యాకేజీ టూర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఈ సారి కర్ణాటక రాష్ట్రంలోని గాన్గాపూర్కు ప్రత్యేక ప్యాకేజీ టూర్ నిర్ణయించినట్లు తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న గురుపౌర్ణమి సందర్భంగా తాండూరు నుంచి శరణు బసవేశ్వర దేవాలయం మీదుగా గాన్గాపూర్ దత్తాత్రేయ దేవాలయంలో ఆర్టీసీ ప్యాకేజీ టూర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఒక్కో ప్రయాణికుడికి రూ.700ల చార్జ్ వసూలు చేయడం జరుగుతుందన్నారు. 9వ తేదిన సాయంత్రం 5గంటలకు తాండూరు డీపో నుంచి బస్సు బయల్దేరుతుందని, తిరిగి మరుసటి రోజు గురువారం సాయంత్రం 5గంటలకు తాండూరుకు చేరుకుంటుందని వివరించారు. తాండూరుతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు బస్టాండ్లో లేదా డీపో మేనేజర్ సెల్: 9959226251, స్టేషన్ మేనేజర్ సెల్ 9441717503, సిస్టం సూపర్ వైజర్ 8309348157 లకు సంప్రదించాలని సూచించారు.


ఇదికూడా చదవండి…

ఏఎంసీ డైరెక్టర్ భగవాన్ కరీం కన్నుమూత