కాంగ్రెస్ రక్త రాజకీయాలు సహించరు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ రక్త రాజకీయాలు సహించరు..!
– దుబ్బాక అభ్యర్థిపై కత్తదాడి దుర్మార్గం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రక్త రాజకీయాలను ఎవ్వరు సహించరని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత చేసిన కత్తి దాడి ఘటనను మంగళవారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఓ ప్రకటనలో ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేమని కాంగ్రెస్ పార్టీ నెత్తుటి రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు. ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ప్రత్యర్థి అభ్యర్థిని హత్య చేసి గెలవాలని ఆ పార్టీ ఆలోచన విధంగా దుర్మార్గమన్నారు. జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖండించకపోవడాన్ని తప్పుపట్టారు. తెలంగాణలో, అశాంతి సృష్టించాలని కాంగ్రెస్ చేస్తున్న రక్త రాజకీయాలను ఎవ్వరు హర్షించరని అన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత