మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
– కాంగ్రెస్ యువనాయకుడి మానవత్వం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో మరణించిన మహిళ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ యువనాయకుడు ఆర్థిక సాయం అందజేశాడు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు 15వ వార్డుకు చెందిన నిరుపేదరాలు అయిన జంటుపల్లి పద్మమ్మ (40) అనారోగ్యం బారిన పడి మృతి చెందింది.

బుధవారం ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ యువనాయకుడు దివిటి ఎల్లప్ప మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. పద్మమ్మ అంత్యక్రియల కోసం తన వంతు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో యువకులు శివకుమార్, రమేష్, సురేష్, అరుణ్, ప్రవీణ్, నరేష్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

