రాత్రంతా భారీ వర్షాలు
– ఆ ఐదు, ఆరు గంటలు కుండపోతే
– అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
దర్శిని ప్రతినిధి: హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రానున్న 5, 6 గంటలు హైదరాబాద్ సిటీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాత్రి సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ, సిద్దిపేట, గజ్వేల్ జిల్లాలో ఇవాళ రాత్రి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గులాబ్ తుఫాన్ తీరాన్ని తాకి బలహీన పడిందని.. అయితే ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. క్రమంగా బలహీన పడి అల్పపీడనంగా మారొచ్చు అని కూడ అన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తుండటం కారణంగా హైదరాబాద్ పై వర్ష ప్రభావం తీవ్రంగా ఉందన్నారు.

