విద్యార్థులకు పండగ కానుక
– ఐవీఎఫ్, వాసవిక్లబ్ ద్వారా కొత్త వస్త్రాల పంపిణీ
– అందజేసిన రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల విద్యార్థులకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్), వాసవిక్లబ్ సభ్యులు పండగ కానుకను అందజేశారు. బుధవారం ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర యూత్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కొత్త వస్త్రాలను పంపిణీ చేశారు. దీపావళి పండగను పురస్కరించుకుని అయిత సంపత్ సహాకారంతో విద్యార్థులకు వస్త్రాలను అందజేసి పండగ సంతోషాన్ని నింపారు. ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఐవీఎఫ్, వాసవి క్లబ్ ద్వారా పాఠశాల విద్యార్థులకు కొత్త వస్త్రాలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.
విద్యార్థుల కోసం తమ వంతు చేయూత అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు పసారం బస్వరాజ్, శెట్టి భాస్కర్, హెచ్ఎం శరత్కళ, వైశ్య ఫెడరేషన్ జిల్లా కోశాధికారి ఆగీరు మహేష్, తాండూరు అధ్యక్షులు కేళీగారి ప్రవీణ్, వాసవి క్లబ్ అధ్యక్షులు రెడ్డి శెట్టి సతీష్, గుముడాల గౌరీ శంకర్, దాదాపురం గురు, వీరేష్, దాదాపురం జగన్, రఘురాం తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

