జోరువాన
– పొంగిపొర్లిన వాగులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: గులాబ్ తుఫాన్ ప్రభావంతో తాండూరు నియోజకవర్గంలో జోరువాన కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లాయి. తాండూరు పట్టణంలో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మండలంలోని అంతారం గ్రామ సమీపంలో ఊరచెరువు నిండుకుని పొలాల్లోని వరథనీరు చేరింది. దీంతో పాటు బైపాస్ రోడ్డు పక్కన కూడ వాననీరు నిలిచి వరిపొలాలన్ని నీటమునిగాయి. అదేవిధంగా చెంగోల్, అల్లాపూర్ తదితర గ్రామాల్లో కూడ చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో పొలాలన్నీ చెరువులను తలపించాయి. బెల్కటూర్ గ్రామంలో వాగు పొంగిపొర్లంతో నీటి ఉధృతికి ఇబ్బందులు లేకుండా సర్పంచ్ మదన్మోహన్ వాగులో జేసీబీ ద్వారా చెత్త చెదారాన్ని తొలగింపు చర్యలు చేపట్టారు.


