తాండూరు టీఆర్ఎస్‌కు జ‌ల‌క్

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు టీఆర్ఎస్‌కు జ‌ల‌క్
– పార్టీని వీడిన ఎమ్మెల్యే అనుచ‌రుడు అక్బ‌ర్ బాబ‌
– 50 మంది కార్య‌క‌ర్త‌ల‌తో సొంత గూటికి చేరిన నేత‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని టీఆర్ఎస్ పార్టీకి జ‌ల‌క్ త‌గిలింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ముఖ్య అనుచ‌రుడు జిల్లా కోఆప్ష‌న్ స‌భ్యుల ఫోరం సంఘం స‌భ్యులు, యాలాల మండ‌ల కోఆప్ష‌న్ స‌భ్యులు అక్బ‌ర్ బాబ సొంత‌గూడు కాంగ్రెస్‌లో చేరారు. మంగ‌ళ‌వారం కాంగ్రెస్ టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డి స‌మక్షంలో.. టీపీసీసీ ఉపాధ్య‌క్షులు ఎం. ర‌మేష్ మ‌హారాజ్ ఆధ్వ‌ర్యంలో అక్బ‌ర్ బాబ కాంగ్రెస్ కండువ క‌ప్పుకున్నారు. అక్బ‌ర్ బాబ‌తో పాటు మ‌రో 50 మంది కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొద‌టి నుంచి కాంగ్రెస్‌లో కొన‌సాగిన అక్బ‌ర్ బాబ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచ‌రుడుగా పేరు పొందారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ చేరిన స‌మ‌యంలో అక్బ‌ర్ బాబ కూడ టీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా తిరిగి ఆయ‌న సొంత పార్టీ కాంగ్రెస్ చేర‌డం తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.