తాండూరు రేసు గుర్రాలు రెడీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు రేసు గుర్రాలు రెడీ..!
– ఖరారైన అభ్యర్థుల జాబితా
– వెల్లడించిన ఎన్నికల అధికారి
– గుర్తుల కేటాయింపు కూడా పూర్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో రేసులో నిలిచే అభ్యర్థుల జాబితా సిద్దమైంది. బరిలో పోటీ చేసే అభ్యర్థులు, వారికి గుర్తుల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయి పోయింది. బుధవారం తాండూరు ఎన్నికల అధికారి ప్రకటించిన వివరాలిలా ఉన్నాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది అభ్యర్థులు ఉండగా నలుగురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని తెలిపారు. దీంతో తాండూరు బరిలో 21 మంది అభ్యర్థులు నిలుస్తున్నారని వెల్లడించారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు. మరోవైపు జాతీయ, ప్రాంతీయ పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయ్యిందని తెలిపారు.

పైలెట్ రోహిత్ రెడ్డి(బీర్ఆర్ఎస్)కి కారు గుర్తు
బోయిని చంద్రశేఖర్(బీఎస్పీ)కి ఏనుగు గుర్తు
బుయ్యని మనోహర్ రెడ్డి(కాంగ్రెస్) హస్తం గుర్తు
అవుటి శ్రీశైలం(నవరంగ్ కాంగ్రెస్ పార్టీ)కి బ్యాట్ గుర్తు
గుడిసే గోపాల్(ప్రజా వెలుగు పార్టీ)కి కెమరా గుర్తు
గౌరీ శ్రీశైలం(ధర్మ సమాజ్ పార్టీ) టార్చ్ లైట్ గుర్తు
ధర్మపురం రాంచంద్రయ్య (భారత చైతన్య యువజన పార్టీ)కి చెరుకు రైతు గుర్తు
నేనావత్ హరినాయక్(బహుజన ముక్తి పార్టీ)కి మంచం గుర్తు
నేమూరి శంకర్ గౌడ్ (జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి)కి గాజు గ్లాసు గుర్తు
మనోహర్ రెడ్డి(జన శంఖారావం పార్టీ)కి బెండకాయ గుర్తు
మారోజూ సునిల్(బహుజన్ లెఫ్ట్ పార్టీ)కి సాసర్ గుర్తు
విఠల్ రాథోడ్(బ్లూ ఇండియా పార్టీ)కి మిక్సీ గుర్తు
అరవింద్ (స్వతంత్ర)కి విజిల్ గుర్తు
నొముల అనిల్(స్వతంత్ర) బూర గుర్తు
పెద్దోళ్ల ఆనంద్ కుమార్(స్వతంత్ర)కు గ్యాస్ సిలిండర్ గుర్తు
మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ (స్వతంత్ర)కు చెప్పులు గుర్తు
మంబాపురం విజయేందర్ (స్వతంత్ర)కు టూత్ బ్రష్ గుర్తు
రాథోడ్ ఆనంద్ నాయక్(స్వతంత్ర) పండ్ల బుట్ట గుర్తు
పి.రోహిత్ రెడ్డి(స్వతంత్ర)కు షిఫ్ గుర్తు
శ్రీ చిలుక గోపాల్(స్వతంత్ర) కు పల్లకి గుర్తు
బి. సుమంత్ ( స్వతంత్ర)కు క్యాలీ ఫ్లవర్ గుర్తులు కేటాయించడం జరిగిందని వెల్లడించారు.

ఇదికూడా చదవండి..

 మోసపోవద్దు గొసపడతాం..