ఆర్టీసీ డ్రైవ‌ర్‌కు రూ. 10వేల జ‌రిమాన

క్రైం తాండూరు వికారాబాద్

ఆర్టీసీ డ్రైవ‌ర్‌కు రూ. 10వేల జ‌రిమాన
– యాక్సిడెంట్ కేసులో తీర్పు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వ్య‌క్తి మృతికి కార‌ణ‌మైన ఆర్టీసీ డ్రైవ‌ర్‌కు రూ. 10వేల జ‌రిమాన విధిస్తూ తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయ‌మూర్తి టీ.స్వ‌ప్న తీర్పు వెలువ‌రించిన‌ట్లు ప‌ట్ట‌ణ ఎస్ఐ గిరి మంగ‌ళ‌వారం ఓప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కేసుకు సంబంధించిన వివ‌రాలిలా ఉన్నాయి. 2015 సంవ‌త్స‌రంలో తాండూరు ఇందిర‌మ్మ కాల‌నీకి చెందిన మొగుల‌య్య ప‌ట్టణంలోని ఇందిర చౌర‌స్తా వ‌ద్ద న‌డుచుకుంటూ వెళుతుండ‌గా ఆర్టీసీ డ్రైవ‌ర్ ల‌క్ష్మ‌ణ్ బ‌స్సుతో ప్రమాద వ‌శాత్తు ఢీకొట్టారు. ఈ ప్ర‌మాదంలో మొగుల‌య్య మృతి చెందారు. కుటుంభీకుల ఫిర్యాదు మేర‌కు అప్ప‌టి ఎస్ఐ నాగార్జున కేసు న‌మోదు చేశారు. మంగ‌ళ‌వారం న్యాయ‌స్థానంలో కేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలించిన న్యాయ‌మూర్తి టీ.స్వ‌ప్న నిందితుడైన ఆర్టీసీ డ్రైవ‌ర్‌కు రూ. 10వేల జ‌రిమాన విధిస్తూ తీర్పు వెలువ‌రించిన‌ట్లు ప‌ట్ట‌ణ ఎస్ఐ గిరి తెలిపారు.