హస్తంతోనే హమాలీలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తంతోనే హమాలీలు..!
– కాంగ్రెస్ గెలుపుకు సంపూర్ణ మద్దతు
– తప్పుడు ప్రచారం ఖండించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని గంజ్ హమాలి కార్మికులు హస్తం పార్టీతోనే ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో హమాలీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్ తో పాటు హమాలి, దడువై, చాట సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన హమాలి కార్మికులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని వచ్చిన వార్తలను ఖండించారు.

కార్మికులంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, ఎన్నికల్లో పార్టీ గెలుపుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మద్దని సూచించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ మాయ మాటలకు మోసపోయింది చాలు అని అన్నారు. మనోహర్ రెడ్డి గెలిచిన వెంటనే హమాలీ, దడువై, చాట సంఘాలలో అర్హులైన కార్మికులకు ఇండ్ల స్థలాల ఇప్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పటేల్ కిరణ్ కుమార్, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడ చదవండి..

సార్లు వస్తున్నారు..!