తాండూరుకు రాహుల్ గాంధీ రాక..!
– ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
– బహిరంగ సభకు స్థలం ఖరారు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత రాహుల్ గాంధీ తాండూరులో పర్యటన ఖరారయ్యింది. ఈ మేరకు తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి ప్రకటన చేశారు. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో 24న చూడలేదు రాహుల్ గాంధీ తాండూరుకు విచ్చేస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ రాకను దృష్టిలో ఉంచుకుని తాండూరులో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం తాండూరు పట్టణంలోని విలియమూన్ మైదానాన్ని బహిరంగ సభ నిర్వహించేందుకు ఎన్నుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ సభ విలియమూన్ మైదానంలో నిర్వహించారు.
అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఈ సారి కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ పర్యటన, బహిరంగ సభను దృష్టిలో ఉంచుకుని భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి…

