సర్కారు బడికి ఐవీఎఫ్ చేయూత
– కోకట్ స్కూల్‌కు వాటర్ ట్యాంకు వితరణ
– 120 మంది విద్యార్థులు యూనిఫామ్స్ పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం కోకట్ లోని ప్రభుత్వ పాఠశాలకు ఇంటర్నేషనల్ వైష్య ఫెడరేషన్(ఐవీఎఫ్) సభ్యులు చేయూతనందించారు. శనివారం ఐవీఎఫ్ రాష్ట్ర యూత్ కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాలకు వాటర్ ట్యాంకు, 120 మంది విద్యార్థులకు యూనిఫామ్స్ ను పంపిణీ చేశారు. తాండూరుకు చెందిన కల్వ శేషు సహాకారంతో వాటర్ ట్యాంకు, ఎస్పీ శ్రీకాంత్ సమాకారంతో యూనిఫామ్స్ ను అందజేశారు.

ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సామాజిక సేవ లక్ష్యంగా ఐవీఎఫ్ ముందుకు సాగుతుందన్నారు. విద్యా, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో కూడా పాఠశాలలకు, పేద విద్యార్థులకు చేయూతనందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఆగీరు మహేష్, సభ్యులు దాదాపురం గురురాజ్, సోమశేఖర్, గ్రామ సర్పంచ్ కృష్ణ, ఎస్ఎంసీ చైర్ పర్సన్ చంద్రకళ, స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

