కాంగ్రెస్ వల్లే అస్వస్థతల అవస్థ..!
– చేతగాక బీఆర్ఎస్ పార్టీపై అబండాలు
– హాస్టల్ విద్యార్థులను హస్పిటల్లో చేర్పించాలి
– ట్రైబల్ హాస్టల్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళన
– జిల్లా కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు
– సబితారెడ్డి, సత్యవతి రాథోడ్లను అడ్డుకోవడంపై ఆగ్రహం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పాలనలోనే వసతిగృహాం, గురుకుల విద్యార్థులకు అస్వస్థతల అవస్థలు జరుగుతున్నాయని తాండూరు బీఆర్ఎస్ నేతలు ద్వజమెత్తారు. తాండూరు పట్టణం సాయిపూర్ లోని ట్రైబల్ హాస్టల్ వద్ద విద్యార్థినిలు అస్వస్థతకు గురైన సంఘటనను ఖండించారు. గురువారం హాసతి గృహం వద్దకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, నాయకులు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో తాండూరుకు విద్యార్థులను పరామర్శించేందుకు వస్తున్న మాజీ మంత్రులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్లను వికారాబాద్లో పోలీసులు అడ్డుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హాస్టల్ గేటు ముందు బైటాయించి ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్ల వసతిగృహాల్లో, గురుకులాల్లో అస్వస్థతల పాలై అవస్థలు పడుతున్నారని అన్నారు. విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందించడంతో విఫలమయ్యిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తను భయాందోళన పాలన చేస్తుందన్నారు. వారి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందని ఆబండాలు వేస్తుందన్నారు. అదేవిధంగా సబితారెడ్డి, సత్యవతి రాథోడ్ లను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. వసతి గృహ విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వసతి గృహంలో విద్యార్థుల పరిస్థితి భయాందోళనను కలిగిస్తుందన్నారు. లీలావతి అనే విద్యార్థిని ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతుందని అన్నారు. వెంటనే అధికారులు విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చూడాలన్నారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పితీరుతామన్నారు.
జిల్లా కలెక్టర్‌తో వాదన
మరోవైపు వసతి గృహం తనిఖీకి వచ్చిన వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో బీఆర్ఎస్ నేతలు వాదనకు దిగారు. విద్యార్థులను వసతి గృహంలో ఉంచి ఎందుకు వైద్యం చేయిస్తున్నారని, ఆసుపత్రికి తరలించాలని వాదించారు. విద్యార్థులను పరామర్శించేందుకు ఎందుకు అనుమతించడం లేదని అడిగారు.
ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ తనకు బిడ్డలు ఉన్నారని. విద్యార్థులు వైద్యానికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నామన్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఎవ్వరిని అనుమతించడం లేదని తెలిపారు. వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మహిళ నాయకురాలు శకుంతలను అనుమతించారు. దీంతో వారు వెళ్లి వి ద్యార్థులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు. శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మండలాల అధ్యక్షులు రవి0దర్ రెడ్డి, నర్సిరెడ్డి(రాజు), పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, కౌన్సిలర్ ముక్తార్ నాజ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు యూనుస్, కరణాకర్ యువనాయకులు సంజీవరావు, ఇంతియాజ్, టైలర్ రమేష్. బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి. జావిద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

