ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..!

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..!
– ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు
– ప్రకటించిన ఇంటర్ బోర్డు అధికారులు
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డు అధికారలు అలర్ట్ ప్రకటించారు. వచ్చే యేడాది ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు (జనరల్‌/వొకేషనల్‌ కోర్సులు) నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రాక్టికల్‌ పరీక్షలు రెండో శనివారం, ఆదివారాల్లోనూ జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్‌లో జరుగుతాయని వివరించారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు ఇంగ్లీష్‌ ప్రాక్టికల్‌ పరీక్ష ఫిబ్రవరి 16న ఉంటుందని సూచించారు.

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్ష తేదీలివే..
ఫిబ్రవరి 28 – పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజి పేపర్‌-1).
మార్చి 1 – పార్ట్‌ 1 (ఇంగ్లీష్ పేపర్‌-1).
మార్చి 4 – పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్-1ఏ, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1).
మార్చి 6 – మేథమేటిక్స్‌ పేపర్‌ 1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1.
మార్చి 11- ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1.
మార్చి 13 – కెమెస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1.
మార్చి 15 – పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్‌).
మార్చి 18 – మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జియోగ్రఫీ పేపర్‌-1.

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్ష తేదీలివే..
ఫిబ్రవరి 29 – పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2).
మార్చి 2 – పార్ట్‌ 1 (ఇంగ్లీష్‌ పేపర్‌-2).
మార్చి 5 – పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్‌ 2ఏ, బోటనీ పేపర్‌ 2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 2).
మార్చి 7 – మేథమేటిక్స్‌ పేపర్‌ 2బి, జూవాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్-2.
మార్చి 12 – ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2.
మార్చి 14 – కెమెస్ట్రీ పేపర్‌ -2, కామర్స్‌ పేపర్‌-2
మార్చి 16 – పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-2 (ఫర్‌ బైపీసీ స్టూడెంట్స్‌).
మార్చి 19 – మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం