శాంతియుతంగా గణేష్‌ ఉత్సవాలు జరుపుకుందాం

తాండూరు రాజకీయం వికారాబాద్

శాంతియుతంగా గణేష్‌ ఉత్సవాలు జరుపుకుందాం
– అల్లర్లు, పుకార్లకు పాల్పడొద్దు
– తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా.. శాంతియుత వాతావరణంలో జరుపుకుందామని తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పోలీసు శాఖ, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ వినాయకులను ప్రతిష్టించే మండప నిర్వహకులు చవితి. నిమజ్జనం రోజున నిబంధనలు పాటించాలన్నారు. ఎలాంటి వివాదాలు, ఘర్షణకు తావులేకుండా శాంతియుత వాతావరణలో పండగను జరుపుకోవాలన్నారు. అన్ని వర్గాలకు అందరు సహకరించి. ఐక్యమత్యాన్ని చాటాలన్నారు. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ లు మాట్లాడుతూ చవితి, నిమజ్జన వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. పుకార్లు నమ్మకుండా, అల్లర్లకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, మాజీ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, సమితి సభ్యులు, మండపాల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!