ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకులు
– పూజలు, నివాళులు అర్పించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద అందరికి ఆదర్శప్రాయుడని తాండూరు నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో స్వామి వివేకానందా 161వ జయంతి ఉత్సవాలు, జాతీయ యువజన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివేక్సేవా సమితి, విశ్వహిందూ పరిషత్ సంఘాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వివేకానంద విగ్రహానికి పూజలు నిర్వహించి పూలమాలలతో నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతీయ తత్వాన్ని, సాంప్రదాయాలను, సాంస్కృతిని విదేశాలలో ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. సామాజిక సేవ ప్రతి ఒక్కరు అలవర్చుకొని వివేకానంద స్వామి ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. వివేకనందుని ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీడే వీరభద్రప్ప, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

