ఘనంగా రామమందిర పునర్ నిర్మాణ శంకుస్థాపన

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా రామమందిర పునర్ నిర్మాణ శంకుస్థాపన
– పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్
– పూజలు నిర్వహించిన డా. సంపత్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరా నగర్ లోని శ్రీ రామ మందిర దేవాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన ఘనంగా జరిగింది. శుక్రవారం దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పునర్ నిర్మాణంకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్, బాలాజీ ఆసుపత్రి అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్ దంపతులు హాజరయ్యారు.

వేద పండితుల మంత్రోచ్చరణల మద్య దేవాలయ పునర్ నిర్మాణ శంకుస్థాప పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరులోని ఏకైక పురాతన శ్రీ రామ మందిర పునర్ నిర్మాణంకు తోడ్పాటు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహాకారం అందిస్తామన్నారు. అదేవిధంగా దేవాలయ కమిటి సభ్యులు మాట్లాడుతూ శ్రీ రామ మందిర నిర్మాణానికి అందరు సహాకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, దోమ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు వడ్డె శ్రీనివాస్, దేవాలయ కమిటి సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

రోడ్డుపై అక్రమణలపై కొరడా..!