టిక్కెట్టుపై రాద్ధాంతమెందుకు..?

తాండూరు రాజకీయం వికారాబాద్

టిక్కెట్టుపై రాద్ధాంతమెందుకు..?
– వచ్చే ఎన్నికల్లో రోహిత్‌ రెడ్డే పోటీ
– 50 వేల బంపర్ మెజార్టీ ఖాయం
– పార్టీకి నమ్మక ద్రోహం చేసింది ఎమ్మెల్సీనే
– ఏమ్మెల్సీ వర్గానికి సవాల్ చేసిన నేతలు
– ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఖండించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆయన వర్గీయులు టిక్కెట్టు రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గం నేతలు విమర్శించారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం) ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, అప్పూతో పాటు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు టిక్కెట్ నాదే, నిలిచేది నేనే.. గెలిచేది నేనే.. అంటూ చేసిన వాఖ్యలను ఖండించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితోనే నియోజకవర్గం అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి రూ. 50 లక్షలు, మండల కేంద్రానికి, మున్సిపల్ వార్డులకు రూ. 1 కోటి నిధులు సాధించిన ఘనత పైలెట్ రోహిత్ రెడ్డికే దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా పోటీ చేసేది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అని, ఎవరు పోటీ చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. రోహిత్ రెడ్డి గెలుపును ఆపే శక్తి ఎవ్వరికి లేదన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా తాండూరు అభివృద్ధికి కృషి చేసిందేం లేదన్నారు. గతంలో కాగ్నా బ్రిడ్జి టెండర్లు, రోడ్డు టెండర్ల విషయంలో అడ్డంకులు సృష్టించెదెవరో అందరికీ తెలుసన్నారు. ఆయన తీసుకవచ్చిన నిధులన్నీ రోటీన్ గా వచ్చినవే అని విమర్శించారు.

తాజాగా ఎమ్మెల్సీ, ఆయన వర్గం నేతలు తాండూరు టిక్కెట్టుపై చిచ్చుపెట్టే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. పార్టీ పిరాయింపులు చేశారని పిట్టకథలు చెబుతూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 2008 నుంచే రోహిత్ రెడ్డి టీఆర్ఎస్లో ఉద్యమకారుడుగా పనిచేశారని, ఎన్నికల సమయంలో టిక్కెట్టు రాకపోవడంతో పార్టీ మారారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తాండూరు అభివృద్ధి కో కోసం మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారని వివరించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహజమేనని అన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేసిన అభివృద్ధితో పాటు నాలుగేళ్లలో పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఒకవేళ ఎమ్మెల్సీ మహందర్ రెడ్డికి టిక్కెట్టు రాకుంటే పార్టీ మారమని ఎమ్మెల్సీ వర్గం నేతలు ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ మరో సవాల్ చేశారు. భద్రేశ్వర దేవాలయంలో గాని, మసీదులలో గాని ప్రమాణ సవాల్ కు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే టిక్కెట్ వస్తుందని, వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పల్లె పల్లెకు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ద మైన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి చుక్కెదురు తప్పదని, గ్రామాల్లో ఎమ్మెల్సీని వ్యతిరేకించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్పి మహేందర్ రెడ్డి, ఆయన అనుచరులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

మున్సిపల్ చైర్ పర్సస్ రెండున్నరేళ్ల పదవి ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఘనత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి దక్కిందన్నారు. దీంతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ములాఖత్ లో ఉంటూ పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా నేతలు పార్టీ విధేయులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తాండూరు అభివృద్ధిలో అందరు కలిసి రావాలని, మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, ఉర్దూఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్ లు ఉన్నారు.

chaithany collage