సంక్రాంతి జోష్ అదరహో..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సంక్రాంతి జోష్ అదరహో..!
– కేవీసీఎస్‌లో ఉత్సహంగా సంబరాలు
– అభినందించిన ప్రిన్సిపల్, యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహారాజ్ దేవాలయ వద్ద ఉన్న క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్)లో సంక్రాంతి జోష్ అదరహో అనిపించింది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని శుక్రవారం స్కూల్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ స్కూల్ విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. పండగలో కనిపించే హరిదారులు, బసవణ్ణలు, భోగి మండలు, సంక్రాంతి గొబ్బెలతో ప్రదర్శలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పాఠశాలల ఆవరణలో విద్యార్థులు, టీచర్లు అందమైన రంగవల్లులను తిర్చిదిద్దారు. విద్యార్థినిలు, మహిళ ఉపాధ్యాయులు సంక్రాంతి బొడ్డెమ్మల ఆట పాటలతో సందడి చేశారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పర్వదినం విశిష్టతను తెలుపుతూ విద్యార్థులు, టీచర్లు జరుపుకున్న సంబరాలపై ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, యాజమాన్యం సభ్యులు అభినందించారు.

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం