బీఆర్ఎస్ సర్కారు ఓటమి తథ్యం
– ఎన్నికల్లో 15 సీట్లకే కారు పరిమితం
– 80-90 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా
– టీపీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి
– దమ్ములేని ఎమ్మెల్యేకు దిమ్మ దించాలి
– కోస్గిలో ప్రియాంక గాంధీ సభ
– విజయవంతానికి భారీగ జనసమీకరణ
– కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో ఆధర్మంగా, అహంకారంతో, అరాచకాలతో పాలన చేస్తున్న బీఆర్ఎస్‌కు నాలుగు కోట్ల ప్రజల చేతుల్లో ఓటమి తధ్యం అని టీపీపీసీ ఉపాధ్యక్షులు, ఎన్నికల ప్రచార, ప్లానింగ్ కమిటి కన్వినర్ మల్లు రవి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో ఆయన తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏండ్లలో అహంకార, ఆధర్మం, అరాచక పాలన కొనసాగించిందన్నారు. సీఎం కేసీఆర్ ఏనాడు ప్రజలను కలవలేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇదే పరిస్థితి ఉండిందన్నారు. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని రజాకార్ల పాలన చేసిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్. కాంగ్రెస్ మద్య పోటీ ఉన్నప్పటికి ప్రస్తుతం నాలుగు కోట్ల మంది ప్రజానికానికి బీఆర్ఎస్ మద్య పోరు జరుగుతున్నట్లుగా ఉందన్నారు. ప్రజలు కసితో, కక్ష్యతో బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాలే గెలిచే అవకాశం ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 90 స్థానాలు గెలవడం పక్కా అన్నారు. తాండూరులో కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పోడిచిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఓడించి మచ్చలేని మనోహర్ రెడ్డిని గెలిపించాలన్నారు.
తాండూరులో పార్టీ అధినేతల రాకకు అనుమతులు ఇవ్వని అధికారులపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఒక్కటిగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కావాలనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ఐటీ, ఈడీ దాడులు నిర్వహిస్తుందన్నారు. అదేవిధంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాను లోకల్, నేను నాన్ లోకల్ అంటూ మాత్రమే ప్రచారం చేస్తున్నారు తప్పా తాండూరుకు చేసిన అభివృద్ధిని చెప్పడం లేదన్నారు. రూ.1600 కోట్లతో ఏం అభివృద్ధి చేశాడో చెప్పలేని దమ్ములేని ఎమ్మెల్యేను ఎన్నికల్లో దిమ్మ దించేలా బుద్ధి చెప్పారు.
ముఖ్యంగా సోమవారం కోడంగల్ నియోజకవర్గం కోసిలో నిర్వహించే సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరువుతున్నారని అన్నారు. ఈ సభకు తాండూరు నుంచి భారీగా జనసమీకరణ చేసి సభను విజయవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీపీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్. రఘువీరా రెడ్డి, నాయకులు ఉత్తమ్ చంద్, మురళీకృష్ణ గౌడ్, జనార్ధన్ రెడ్డి, ఎం, రాకేష్, సాయిపూర్ బాల్ రెడ్డి, పట్లోళ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

