శ‌భాష‌మ్మా.. ఐశ్వ‌ర్య జ్యోతి..!

కెరీర్ తాండూరు రంగారెడ్డి వికారాబాద్

శ‌భాష‌మ్మా.. ఐశ్వ‌ర్య జ్యోతి..!
– కెనెరా బ్యాంకులో ఉద్యోగం సాధించిన దివ్యాంగురాలు
– స‌న్మానించిన మున్సిప‌ల్ మాజీ చైర్ ప‌ర్స‌న్ కోట్రిక విజ‌య‌ల‌క్ష్మీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : విధి త‌న‌ను విక‌లాంగురాలును చేసినా.. మ‌నోధైర్యం కోల్పోకుండా ఉద్యోగవ‌కాశాన్ని సాధించిన ఐశ్వ‌ర్య జ్యోతిని తాండూరు మున్సిప‌ల్ మాజీ చైర్ ప‌ర్స‌న్ కోట్రిక విజ‌య‌ల‌క్ష్మీ శ‌భాష్ అంటూ అభినందించారు. తాండూరు ప‌ట్ట‌ణానికి చెందిన పి. ర‌మేష్‌, సంగీత దంప‌తుల కూతురు ఐశ్వ‌ర్య జ్యోతి దివ్యాంగురాలు. ఐశ్వ‌ర్య జ్యోతి హైదారాబాద్‌లోని విక‌లాంగుల క‌ళ్యాణ వేధిక వీ ఫర్ యూ సంస్థ ఫౌండ‌ర్ సుభాష్ గుప్త స‌హాకారంతో 2010లో ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసి.. ఎంఏ, ఎల్ఎల్‌బీ చ‌దివింది. ఐబీపీలో ఉత్తీర్ణ‌త సాధించిన ఐశ్వ‌ర్య జ్యోతి కెనెరా బ్యాంకులో ఉద్యోగం సాధించింది. తాండూరు సోష‌ల్ వ‌ర్క‌ర్ ద్వారా విష‌యం తెలుసుకున్న తాండూరు మున్సిప‌ల్ మాజీ చైర్ ప‌ర్స‌న్ కోట్రిక విజ‌య‌ల‌క్ష్మీ విక‌లాంగ క‌ళ్యాణ వేధిక వీ ఫ‌ర్ యూ సంస్థ ఫౌండ‌ర్ సుభాష్ గుప్త‌ను, ఉద్యోగం సాధించిన విక‌లాంగురాలు ఐశ్వ‌ర్య జ్యోతిని ఆదివారం ఇంటికి పిలిపించి ప‌ల‌క‌రించారు. ఉద్యోగం సాధించిన ఐశ్వ‌ర్య జ్యోతిని స‌న్మానించి శ‌భాష్ అంటూ అభినందించారు. భవిష్య‌త్తులో మ‌రిన్ని ఉన్న‌త ప‌ద‌వులు పొంది ఆద‌ర్శంగా నిలవాల‌ని ఆకాంక్షించారు. అదేవిధంగా ఫౌండ‌ర్ సుభాష్ గుప్త‌ను కూడ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య జ్యోతి త‌ల్లిదండ్రులు రమేష్, సంగీత, సోషల్ వర్కర్ వెంకట్, టీఆర్ఎస్ నాయకులు కోట్రిక శ్రీ‌కాంత్, కోటం సిద్ద‌లింగం, చిట్టెమ్మ, అనంతలక్ష్మి, సోనీ, విజయలక్ష్మి, జయలక్ష్మి, ప్రవళిక, రమణ తదితరులు పాల్గొన్నారు