పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి
– మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
– కార్మికులకు రేయిన్ కోట్లు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని తాండూరు మున్సిపల్ గాంధీనగర్ కౌన్సిలర్ సంగీత అజయ్‌సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. సోమవారం వజ్రోత్సవ వేడుకలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానికంగా పలు ప్రదేశాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పూర్తి మేరకు సంగీత ఠాకూర్ వార్డులో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రేయిన్ కోట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో వాడలు.. వీధులు పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు సేవలందిస్తుంటారని అన్నారు. ప్రజా ఆరోగ్యంలో వారు అందించే సేవలు మరువలేని వన్నారు. తమ వంతుగా కార్మికులకు రేయిన్ కోట్లు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


