పార్టీ మారడంపై పైలెట్ క్లారీటీ..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

పార్టీ మారడంపై పైలెట్ క్లారీటీ..!
– పుకార్లకు చెక్‌ పెట్టిన రోహిత్ రెడ్డి
– 30న తాండూరుకు కేటీఆర్ రాక
– నియోజకవర్గ నేతలతో సుదీర్ఘ చర్చలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: గత కొన్ని రోజులుగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ వచ్చిన పుకార్లపై ఆయన స్పందించారు. తాండూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలకు క్లారీటీ ఇచ్చారు. దీంతో రాజకీయంగా జోరందుకున్న ప్రచారానికి చెక్‌ పడింది. గురువారం తాండూరుకు వచ్చిన ఆయన తన నివాసంలో నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా అందరు పనిచేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తన వ్యాపారం నిమిత్తం ఆఫ్రీకాకు వెళ్లడంతో పార్టీ వ్యవహరాలకు దూరంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక నుంచి తన బాబాయి శ్రీశైల్‌ రెడ్డి పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించుకుందామన్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 30వ తేది శనివారం తాండూరు పట్టణంలోని జీపీఆర్ గార్డెన్ లో సన్నాహాక సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని తెలిపారు.

సమావేశానికి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి దిగ్విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీశైల్ రెడ్డి, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మాజీ సర్పంచ్ రాజప్ప గౌడ్, రాంలింగారెడ్డి, వీరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, గౌడి వెంకటేశం, నరేందర్ రెడ్డి, పటేల్ ఉమాశంకర్, అంతారం రాములు, రాకేష్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, వసంత్ కుమార్, అశోక్ కుమార్, జైపాల్రెడ్డి, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్ యాదవ్, ఆయా మండలాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు