కొత్తిమీరలో ఆరోగ్యమంత్రం..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

కొత్తిమీరలో ఆరోగ్యమంత్రం..!
– ఒళ్లునోప్పుల నివారిణిగా ఉపయోగం
– మరిన్ని వ్యాధులు దూరం
దర్శిని డెస్క్: కొత్తిమీర పేరే తెలియని వారు ఉండరు. ప్రకృతి నుంచి లభించే ఈ మొక్క ఆరోగ్యంపై మంత్రంలా పనిచస్తుందని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన కొత్తిమీరతో అనేక తీవ్రమైన వ్యాధులకు విరుగుడుగా పనిచేస్తుంది. ఆకులతో పాటు వేర్ల నుంచి కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. ఒళ్లు నొప్పులతో బాధపడేవారు శాశ్వత ఉపశమనం కోసం ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా కొత్తిమీర చక్కగా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎలాంటి నొప్పులకైనా హోం రెమెడీస్ చాలా అద్భుతంగా పని చేస్తాయి. అందులో కొత్తిమీర కూడా ఒకటి. కొత్తిమీర వాడకంతో కూడా ఒళ్లు నొప్పులను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం.

కొత్తిమీరతో ఆయుర్వేదంలో వివిధ ఉపయోగాలున్నాయి. దీని ఆకులను పేస్టులా చేసి వాపు లేదా గాయంపై రాస్తే గాయం త్వరగా మానుతుంది. దీని ఆకులు, వేర్ల కషాయం అన్ని కాలేయ వ్యాధులను నయం చేస్తుంది. దీని మూలం కడుపులో రాళ్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. కొత్తిమీర ఎండిన ఆకుల పొడిని ఉసిరి పొడితో కలిపి తీసుకున్నట్టయితే.. శరీరం నుండి రక్తహీనతను తొలగిస్తుంది. ఇది దీర్ఘకాలిక నొప్పి లేదా స్వల్పకాలిక జ్వరాన్ని కూడా నయం చేస్తుంది. కొత్తిమీర అనేక వ్యాధులలో నొప్పి నివారిణిగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరతో మంట, గాయం, మూత్ర విసర్జన, ఆకలి లేకపోవడం, జీర్ణక్రియ, జ్వరం, రక్తహీనత వంటి అనేక ఆయుర్వేద ఉపయోగాలు ఉన్నాయి.

కానీ ఆయుర్వేద వైద్యులను సంప్రదించిన తర్వాతే, ఈ మందును వాడాలని పదే పదే చెబుతున్నారు. రోగి వయస్సు, వ్యాధిని బట్టి దీనిని వాడాలి. సరైన మోతాదును నిర్ణయించాలి. కాబట్టి ఈ ఔషధం ప్రయోజనం పొందడానికి, ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని ఉపయోగించాలి.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!