చలివేంద్రాలతో దాహార్తి దూరం

తాండూరు రాజకీయం వికారాబాద్

చలివేంద్రాలతో దాహార్తి దూరం
– జమియత్‌ ఉలేమా సేవలు అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వేసవిలో ప్రజల దాహార్తి చలివేంద్రాలతోనే తీరుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో పట్టణంలోని పోలీస్టేషన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో చలివేంద్రాలతో దాహార్తి తీరుతుందన్నారు.

వేసవిలో జమియత్‌ ఉలేమా ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు, బాట సారులు ఈ చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్‌ గౌడ్, వడ్డె శ్రీనివాస్, నారా అశోక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, బాతుల వెంకటయ్య, నేతలు, జమియత్ ఉలేమా వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్దుల్ రెహమాన్ అథర్ హస్మీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!