ఎమ్మెల్యే వర్గంలో చేరిన కొన్సిలర్ వెంకన్న గౌడ్

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే వర్గంలో చేరిన కొన్సిలర్ వెంకన్న గౌడ్
– శాలువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 8వ వార్డు రాజీవ్ కాలనీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గంలో చేరారు. బుధవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో ఆయన వర్గంలో చేరారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కౌన్సిలర్ వెంకన్న గౌడ్ కు శాలువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకన్న గౌడ్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే వర్గంలో చేరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో వార్డు అభివృద్ధి చేపట్టి రూపు రేఖలు మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, నాయకులు, యువనాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.