మహిళల ఔనత్యాన్ని పెంచే పండగ బతుకమ్మ
– చీరలను పంపిణీ చేసిన కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, ప్రవీణ్‌గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఔనత్యన్నా చాటే గొప్ప పండగ బతుకమ్మ అని తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్, టీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్లు అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని 20వ వార్డు, 33వ వార్డులకు సంబంధించి రేషన్ పంపిణీ దుకాణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సంగీత ఠాకూర్, ప్రవీణ్ గౌడ్లు హాజరై మహిళలతో పాటు యువతులకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఔనత్యాన్ని చాటే బతుకమ్మ పండగ మన తెలంగాణలో ఉండడం మనందరికీ గర్వకారణం అన్నారు. సంస్కృతి సంప్రదాయాలతో పాటు మహిళలను గౌరవిస్తూ జరుపుకునే బతుకమ్మ సందర్బంగా మహిళలకు చీరలను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. మహిళలు, యువతులు బతుకమ్మ పండగను, నవరాత్రి ఉత్సవాలను, దసరా పండగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.

